ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు

ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు

KDP: సిద్దవటం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రమైన సిద్దవటంలో గురువారం పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా మండల పరిషత్ సభా భవనంలో జరిగిన సమావేశంలో ఎంపీడీవో పణి రాజకుమారి మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ దినోత్సవ ప్రాముఖ్యతను వివరిస్తూ ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థ గర్వకారణమని అన్నారు.