వ్యవసాయ యూనివర్సిటీలో పాకిస్థాన్ జెండా కలకలం
బాపట్ల వ్యవసాయ యూనివర్సిటీలో పాకిస్థాన్ జెండా కలకలం రేగింది. విద్యార్థి వీర శివ కోటేశ్వరరావు తన ఛాతిపై పాకిస్థాన్ జెండా పెట్టి ఫొటో దిగారు. దానిని మరో విద్యార్థి శశికిరణ్ కాలేజీ గ్రూపులో పోస్ట్ చేశారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారించారు. గ్రూపులో పోస్ట్ చేసిన ఫొటో ఏఐ (AI) జెనరేటెడ్ ఫొటో అని జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వరరావు తెలిపారు.