'సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని ఖండిస్తున్నాం'
MBNR: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరేళ్ల యాదయ్య అన్నారు. మంగళవారం బాలానగర్ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా కూడా దళితులపై దాడులు కొనసాగుతున్నాయన్నారు. ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.