BREAKING: పాకిస్తాన్‌లో భూకంపం

BREAKING: పాకిస్తాన్‌లో భూకంపం

పాకిస్తాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రత నమోదు అయింది. ఈ సమాచారాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ నిర్ధారించింది. అయితే ఈ ఘటన వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎంత జరిగిందనే సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, పాకిస్తాన్ భౌగోళికంగా యూరేషియన్, భారత టెక్టోనిక్ ప్లేట్ల సంగమంలో ఉండటం వల్ల భూకంపాలకు అత్యంత సునాయాసమైన దేశాలలో పాకిస్తాన్ ఒకటి.