చెక్ డ్యాంల ఘటనపై మంత్రి ఉత్తమ్ తీవ్ర ఆగ్రహం
పెద్దపల్లి జిల్లా గుంపుల, అడవి సోమనపల్లి గ్రామాల్లో చెక్ డ్యాంల ధ్వంసం ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరక నిర్మాణం లేదా నాణ్యత లోపం తేలితే కఠిన చర్యలు తప్పవని, కావాలనే ధ్వంసం చేసినట్లు తేలినా ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు, బాధ్యులను గుర్తించి వేగవంతం చేయాలనారు.