లోకేశ్వరంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం

లోకేశ్వరంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం

NRML: లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం అర్ధరాత్రి ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు ఒక గంటసేపు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఇదిలా ఉంటే రాగల రెండు మూడు రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.