'పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి'
KRNL: ఎమ్మిగనూరు పట్టణ, మండల పరిధిలో జరుగబోయే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంఈవో-1 ఆంజనేయులు పేర్కొన్నారు. పరీక్షలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయన్నారు. మండలంలో 3,397 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని పేర్కొన్నారు. మొత్తం 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.