హైవేపై పశువులు.. తప్పని ఇక్కట్లు

అల్లూరి: రంపచోడవరం నుంచి అడ్డతీగల మీదుగా పాడేరు వెళ్లే జాతీయ రహదారి పశువులకు నిలయంగా మారింది. అడ్డతీగల, రాజవొమ్మంగి, గంగవరం గ్రామాల్లో నిత్యం రోడ్లపై పశువులు సంచరించడంతో వాహనాలు నడిపే వారు పశువులను గుద్దుకుని ప్రమాదాల బారిన పడుతున్నారు. రాత్రి సమయంలో మరింత ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతంలో పశువులను ఢీకొని ఇటీవల పలువురు గాయపడ్డారని స్థానికులు తెలిపారు.