అశ్వాపురంలో ఎమ్మెల్యే పర్యటన

BDK: అశ్వాపురం మండలంలో సోమవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటించనున్నారు. అశ్వాపురం, తురమలగూడెం, గొల్లగూడెం పంచాయతీల్లో రూ.33లక్షలతో, చింతిర్యాలగూడెం, చింతిర్యాల, మంగలిచెలక, గ్రామాల్లో రూ.23లక్షలతో నిర్మించిన సిమెంట్ రహదారులను ప్రారంభించనున్నారు. చంద్రలబోడు పంచాయతీలో రూ.2కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.