దెబ్బతిన్న రోడ్డు.. ప్రమాదాలలో ప్రజలు
KNR: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చిగురుమామిడి మండలంలో రోడ్లు దెబ్బతినడంతో వరి ధాన్యాన్ని మిల్లులకు తరలించే ట్రాక్టర్లు బోల్తా కొడుతున్నాయి. రేకొండ, ముల్కనూర్, ఓగులాపూర్ ప్రాంతాల్లో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పింది. డ్రైవర్లు జాగ్రత్తగా ధాన్యాన్ని తరలించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.