నేడు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భజరహత్నూర్ మండలంలోని పిప్పిరి గ్రామంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టింది.