మాజీ కౌన్సిలర్ అనసూయమ్మ మృతి
PLD: మాచర్ల 22వ వార్డు మాజీ కౌన్సిలర్, టీడీపీ నాయకురాలు దేవుళ్ల అనసూయమ్మ బుధవారం ఆకస్మికంగా మృతి చెందారు. ఆమె మరణంతో స్థానిక తెలుగుదేశం శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు పట్టణ టీడీపీ అధ్యక్షుడు కోమెర దుర్గారావు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె మరణం పార్టీకి తీరని లోటని నేతలు పేర్కొన్నారు.