'పెంచలయ్య హంతకులను అరెస్టు చేయాలి'
ATP: నెల్లూరు జిల్లాలో సీపీఎం నేత పెంచలయ్య హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇవాళ గుంతకల్లు సీపీఎం నాయకులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు మాట్లాడుతూ.. గంజాయి అమ్మకదారులు సిపిఎం నేత పెంచలయ్య అత్యంత దారుణంగా హత్య చేశారు. రాష్ట్రంలో గంజాయి విక్రేతలను అరెస్టు చేయాలన్నారు.