VIDEO: అన్నా క్యాంటీన్‌ను తనిఖీ చేసిన కమిషనర్
ప్రకాశం: గిద్దలూరులోని అన్నా క్యాంటీన్‌ను శుక్రవారం కమిషనర్ రమణబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందిస్తున్న అల్పాహారం నాణ్యతను కమిషనర్ పరిశీలించారు.ఇటీవల ఆహార నాణ్యతపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీ నిర్వహించామన్నారు. ఆహార తయారీదారులకు సూచనలు ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా భోజనం నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.