బస్సు ఢీకొని రైతుకు తీవ్ర గాయాలు
అన్నమయ్య: మదనపల్లె పట్టణంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వాల్మీకి వీధికి చెందిన రైతు లక్ష్మీనారాయణ (57) తీవ్రంగా గాయపడ్డారు. బస్సు స్కూటర్‌ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే ఆయనను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యుల చికిత్సతో ప్రాణాపాయం నుంచి కోలుకుంటున్నారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, బస్సును స్వాధీనం చేసుకున్నారు.