సత్తుపల్లిలో ఎడతెరిపిలేని వర్షం

సత్తుపల్లిలో ఎడతెరిపిలేని వర్షం

KMM: సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాలలో మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. వాగులు పొంగి ప్రవహిస్తుండగా చెరువులు జలకళను సంతరించుకున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. తల్లాడతోపాటు ఆయా గ్రామాలలో బ్రిడ్జిపై నుంచి వాగులు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. బేతుపల్లి, లంకాసాగర్ ప్రాజెక్టులు అలుగు పారుతున్నాయి.