VIDEO: 'ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు'

PPM: ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు అవకాశం సీఎం చంద్రబాబు కల్పిస్తున్నారని గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. సోమవారం 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా పాచిపెంటలో మాట్లాడారు. అభివృద్ధితో పాటు తల్లికి వందనం, మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు, పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. టీడీపీ మండల అధ్యక్షుడు గుడెపు యుగంధర్ పాల్గొన్నారు.