VIDEO: పిల్లలతో కలిసి నేల మీదనే కలెక్టర్ భోజనం
VKB: దుద్యాల మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ దీపక్ తివారి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం, పాలు, గుడ్ల నాణ్యతను పరిశీలించి చిన్నారులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలని అధికారులను ఆదేశించారు.