పత్తికొండలో గ్రామ హెల్త్ శానిటైజేషన్ కార్యక్రమం
KRNL: పత్తికొండ గ్రామంలో హెల్త్ శానిటైజేషన్ కార్యక్రమం శుక్రవారం వైద్యాధికారిణి సుజాత ఆధ్వర్యంలో జరిగింది. సర్పంచ్ కొమ్ము దీపిక ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.హెల్త్ సెంటర్స్‌లో శానిటేషన్‌పై నిర్ణయాలు తీసుకుని సిబ్బందికి సూచనలు ఇచ్చారు. గర్భిణీలు, వృద్ధులు, మహిళలపై వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ప్రతినెలా 2వ శుక్రవారం ఈ సమావేశం కొనసాగుతుందని వైద్యాధికారిణి పేర్కొన్నారు.