రాష్ట్రస్థాయి బాలికల సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శన
కోనసీమ: రామచంద్రపురం పట్టణంలో రేవతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి బాలికల సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శన ఆదివారం ఘనంగా జరిగింది. ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీ కృష్ణ సాయి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థినిలు 200 ప్రాజెక్టులను ప్రదర్శించారు. అనంతరం విజేతలకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.