'రాజమహేంద్రవరం' ఎందుకంత స్పెషల్..!

'రాజమహేంద్రవరం' ఎందుకంత స్పెషల్..!

E.G: రాజమండ్రి (రాజమహేంద్రవరం) రాష్ట్రానికి సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచింది. ఆదికవి నన్నయ భట్టు ఇక్కడే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం ప్రారంభించారు. అందుకే దీనిని తెలుగు భాషాకు పురిటిగడ్డగా భావిస్తారు. అలాగే గోదావరి నదిపై ఉండే రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ ఆసియాలోనే అత్యంత పొడవైన స్పాన్ కలిగిన వాటిలో ఒకటి. ఇక్కడ జరిగే గోదావరి ఫుష్కరాలు, రోజ్ మిల్క్, మడత కాజా చాలా ఫేమస్.