రామయ్య కళ్యాణ వైభవం (డ్రోన్ వీడియో)
కడప: రెండో అయోధ్యగా పేరుపొందిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపాల అలంకరణతో అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాల అలంకరణతో ఆలయం మొత్తం శోభాయమానంగా కనిపించి, భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ డ్రోన్ వీడియో పైన చూడవచ్చు.