ఔట్‌సోర్సింగ్ కారుణ్య నియామకాలకు ప్రభుత్వం ఆమోదం

ఔట్‌సోర్సింగ్ కారుణ్య నియామకాలకు ప్రభుత్వం ఆమోదం

KRNL: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి చొరవతో 13 మంది ఔట్ సోర్సింగ్ PH వర్కర్ల కుటుంబాల కారుణ్య నియామకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన సర్‌క్యూలర్‌ను ఇవాళ ఆయన ఆయా కుటుంబాలతో కలిసి మీడియా ముందు ప్రదర్శించారు. ఎమ్మెల్యే అవిశ్రాంత కృషి పట్ల బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ శాలువాతో సత్కరించారు.