ఘనంగా శివరాత్రి మహోత్సవాలు

ఘనంగా శివరాత్రి మహోత్సవాలు

ఎన్టీఆర్ జిల్లా రామకృష్ణాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం నుండే భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అమృత పాశుపత రుద్ర హోమం వైభవంగా జరిగింది. ఈ మహోత్సవాలు అద్దంకి ఉమా ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేరద రవిరాజు సహా పలువురు దంపతులు పాల్గొన్నారు.