ప్రొద్దుటూరులో ప్రత్యేక పూజలు

ప్రొద్దుటూరులో ప్రత్యేక పూజలు

కృష్ణా: కంకిపాడు మండలం ప్రొద్దుటూరులో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రతిష్ఠ ఉత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధల మధ్య ప్రారంభమయ్యాయి. ఈ నెల 21వ తేదీన శాస్త్రోక్త విధానంలో స్వామివారి విగ్రహంతో పాటు ధ్వజస్తంభం ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు