జిల్లాలో పదేళ్ల బాలుడి దారుణ హత్య
కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నందివాడ మండలం పెదలింగాలో ఓ బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. నాన్నమ్మ లక్ష్మీతో(70) కలిసి మనువడు బాలాజీ (10) ఇంట్లో నిద్రిస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో బాలాజీ మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా.. దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.