సీఎం సహాయనిధికి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ విరాళం

తూ.గో: విజయవాడ వరద బాధితుల సహాయార్థం అనపర్తి ఏరియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షల విరాళమిచ్చారు. అనపర్తి మండలం రామవరంలో ఆదివారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్రి వెంకటరెడ్డి, సెక్రటరీ రామమూర్తి రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్.. మిల్లర్లతో కలిసి చెక్కును అందజేశారు.