మల్కాజ్‌గిరి పరిధిలో కొన్నేళ్లలో..!
MDCL: కొన్నేళ్లలో మల్కాజ్‌గిరి చిన్నరాయుని చెరువు సమీపంలో రూ.2.3 కోట్లతో బాక్స్ డ్రెయిన్ నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గౌతమ్ నగర్ డివిజన్‌లోని ఇందిరా నెహ్రు నగర్ సాయిబాబా ఆలయం వద్ద రూ.21 లక్షలతో డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మరోవైపు హెచ్ఎంటి నగర్, నాచారం పెద్ద చెరువు వద్ద రూ.30 కోట్లతో సుందరీకరణ జరగనుంది.