'పేద కమ్మవారి అభివృద్ధికి తోడ్పడాలి'

'పేద కమ్మవారి అభివృద్ధికి తోడ్పడాలి'

ప్రకాశం: రాష్ట్రంలో వెనుకబడి ఉన్న పేద కమ్మవారి అభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు, రాష్ట్ర కమ్మ వారి సేవా సమాఖ్య అధ్యక్షులు మండవ మురళీకృష్ణ కోరారు. గురువారం ఒంగోలులోనీ రీడింగ్ రూమ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాదెండ్ల బ్రహ్మం చౌదరిని కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలుతెలిపారు.