ఈనెల 30న జిల్లాలో మెగా జాబ్ మేళా
KRNL: యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పిలుపునిచ్చారు. ఈనెల 30న ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జిల్లాలొ రామచంద్రనగర్‌లోని శ్రీ సాయికృష్ణ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. 14 ప్రైవేట్ కంపెనీల్లో 750 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు.