YCP విద్యార్థి విభాగంలో 6 వేల సంతకాల సేకరణ
KRNL: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను విద్యార్థులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా YCP విద్యార్థి విభాగం గౌతమ్ ఆధ్వర్యంలో సేకరించిన 6 వేల సంతకాలను శనివారం ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.