గురుకుల పాఠశాల ప్రవేశాలకు నోటిఫికేషన్

గురుకుల పాఠశాల ప్రవేశాలకు నోటిఫికేషన్

TPT: నాయుడుపేట మండలం గొట్టిప్రోలు ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ రవీంద్రయ్య తెలిపారు. 3వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో 40 సీట్లు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు బ్యాక్ లాగ్ సీట్లకు ఎస్టీ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.