టీయూలో వాలీబాల్ పోటీలు ప్రారంభం
NZB: క్రీడల ద్వారా వ్యక్తి పరిపూర్ణ వికాసం పొందుతారని తెలంగాణ యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ డా. ప్రవీణ్ మామిడాల పేర్కొన్నారు. యూనివర్సిటీ క్రీడా మైదానంలో స్పోర్ట్స్ డైరెక్టర్ డా. బాలకిషన్ ఆధ్వర్యంలో ఇంటర్ కాలేజ్ వాలీబాల్ (పురుషులు, మహిళలు) పోటీలను నిర్వహించగా.. మంగళవారం సాయంత్రం ప్రిన్సిపల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.