పత్తిచేనులో డెడ్ బాడీ కలకలం
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని శంభునిపల్లి గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గోనెసంచిలో కప్పి పడేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పత్తిచేనులోని మృతదేహన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించినట్లు చెప్పారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.