శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 24 గేట్లు ఎత్తివేత

NZB : ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద కారణంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌కి వరద నీరు పోటెత్తుతోంది. 24 గేట్లను ఎత్తి 50,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లోగా 1,25,400 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇక ప్రాజెక్టు తాజా నీటిమట్టం 1089.3 అడుగుల (74.425TMC)నీటి మట్టం చేరిందని అధికారులు తెలిపారు.