VIDEO: సర్పంచ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు
BDK: జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో సర్పంచ్ గంగావత్ నవీన్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు అద్భుతంగా జరిగాయి. ఇక్కడ ఆనవాయితీ ప్రకారం మూడు రోజుల పాటు వేడుకలు జరగడం విశేషం. కుల పెద్దలు సాంప్రదాయ పూజలైన గేరియా, ఖారోబారో పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా కామ దహనం చేశారు. డప్పు చప్పుళ్లు, మహిళల ప్రదక్షిణలు, పురుషులు 'చెర్రా' అంటూ చేసే కేరింతలు కొట్టారు.