దళారుల వలలో మొక్కజొన్న రైతులు
KMR: జిల్లాలో మొక్కజొన్న పంట పండిన రైతులకు ప్రభుత్వ హామీలు ఊకదంపు ఉపన్యాసాలుగానే మిగిలిపోయయా అంటే అవుననే వాదనను రైతుల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. ప్రతి గింజ కొంటాం అని ప్రకటనలు చేసిన ప్రభుత్వ యంత్రాంగం.. తీరా రైతు దగ్గరకు వచ్చేసరికి మార్క్‌ఫెడ్ విధించిన కఠిన షరతులతో రైతన్నలను తీవ్ర నష్టాల ఊబిలోకి నెడుతోంది.