తలుపులమ్మ లోవలో కాటేజీలు ప్రారంభించిన యనమల

E.G: తుని మండలం లోవ కొత్తూరులోని శ్రీతలుపులమ్మ లోవ క్షేత్రంలో ఎస్‌ఎల్‌ఆర్ కాటేజీలను మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం ప్రారంభించారు. అమ్మవారి దేవస్థానానికి ఇతర రాష్ట్రలు, దేశాలు నుండి భక్తులు వస్తారు కావున ఇలాంటి కాటేజీలు ఏర్పాటు చేయడం శుభదాయకమని యనమల ఎస్ఎల్ఆర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబుతో పాటు కూటమి నేతలు పాల్గొన్నారు.