గోదావరిలో గల్లంతైన మృతదేహం లభ్యం
కోనసీమ: పి.గన్నవరంలోని ముంజవరంలో గోదావరి నదిలో ప్రమాదవశాత్తు జారిపడి త్రిమూర్తులు అనే వ్యక్తి గల్లంతైన విషయం తెలిసిందే. కాగా, అతని మృతదేహం బుధవారం లభ్యమైనట్లు SI శివకృష్ణ తెలిపారు. కొర్లపాటివారిపాలేనికి చెందిన త్రిమూర్తులు, మంగళవారం బంధువుల ఇంటికి వచ్చి నదికి వెళ్లిన క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. తహసీల్దార్ శ్రీపల్లవి ఆధ్వర్యంలో SDRF బృందాలు గాలించి మృతదేహాన్ని వెలికితీశాయి.