కారు బీభత్సం.. పలువురికి గాయాలు
VZM: దాకమర్రి జంక్షన్ వద్ద మంగళవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. విశాఖ నుంచి విజయనగరం వెళ్తున్న కారు రోడ్డు పక్కన బైక్ నిలిపి ఉన్న ఇద్దరని ఢీకొట్టి, అదే వేగంతో రోడ్డు దాటుతున్న మరో ముగ్గురిపైకి దూసుకెళ్లింది. దీంతో వారికి తీవ్ర గాయాలవ్వగా, స్థానికులు విజయనగరం ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ పరారైనట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.