చేపల వేట నిషేధం అమలు
VSP: ఫిషరీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు చేపల వేట నిషేధం అమల్లో ఉందనికోస్టల్ సెక్యూరిటీ పోలీసులు హెచ్చరించారు. ఫిషింగ్ హార్బర్, డ్రైడాక్ ప్రాంతాల్లో గస్తీ పెంచి ఎలాంటి బోట్లు సముద్రంలోకి వెళ్లకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని, అలా వెళ్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు.