పామూరులో పూరిల్లు దగ్ధం

పామూరులో పూరిల్లు దగ్ధం

ప్రకాశం: పామూరు పట్టణంలోని అంకాలమ్మ వీధిలో గల ఏకలవ్య నగర్‌లో దాసరి గంగయ్య అనే వ్యక్తి పూరిల్లు దగ్ధం అయింది. ఇంట్లో వంట చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. మంటలు చెలరేగటంతో ఇంట్లో ఉన్న వారు బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.