'సీఎం జిల్లా పర్యటనను విజయవంతం చేయండి'
PPM: ఈ నెల 5వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం భామిని ఏపీ మోడల్ స్కూల్ సమావేశపు మందిరంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు.