VIDEO: శిధిలమైన ట్యాంకులను పరిశీలించిన అధికారులు
ELR: నూజివీడు గాంధీ మున్సిపల్ పార్క్, జడ్పీ బంగ్లా ఆవరణలో ఉన్న శిధిలమైన ఓవర్ హెడ్ ట్యాంక్స్‌ను అధికారులు బుధవారం పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ పీరయ్య ఆదేశంతో వైస్ ఛైర్మన్ పగడాల సత్యనారాయణ పర్యవేక్షణలో డీఈ వెంకట్రావు, ఏఈ వంశీ అభిషేక్, కౌన్సిలర్ కందుల సత్యనారాయణలు పర్యవేక్షించారు. పాతవి తొలగించి, కొత్త ట్యాంకులు త్వరలో నిర్మిస్తామన్నారు.