VIDEO: విద్యార్థులకు ఎల్లిపాయ కారంతో భోజనం ఎక్కడో తెలుసా..?
MHBD: కొత్తగూడ మండలంలోని ఏకలవ్య మోడల్ స్కూల్‌లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 15 రోజులుగా ఎల్లిపాయ కారంతోనే భోజనం అందించడంతో అనేక మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయగా, వారు యాజమాన్యాన్ని నిలదీయడంతో ఇవాళ గుడ్డు కూర పెట్టారు. అయినా అందులో పురుగులు కనిపించాయి.