పదవీ విరమణ పొందిన జవాన్ సర్పంచ్ బరిలో..
JGL: తన ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణే ప్రధాన ధ్యేయంగా సేవలందించి పదవీ విరమణ పొందిన ఓ ఆర్మీ జవాన్ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. మల్యాల మండలం నూకపెల్లి గ్రామానికి చెందిన చెవులమద్ది శ్రీనివాస్ అలియాస్ మిలిటరీ శీను ఇండియన్ ఆర్మీలో 17 ఏళ్లు సేవలందించి హవల్దార్ హోదాలో పదవీ విరమణ పొందారు. దీంతో గ్రామంలోని ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో వచ్చారు.