కమ్యూనిటీ భవన నిర్మాణానికి రూ. 15లక్షలు: ఎంపీ

సత్యసాయి: రామగిరి మండలం దుబ్బారుపల్లి గ్రామ వాల్మీకి సోదరులు హిందూపురం ఎంపీ బీకే పార్థసారధిని కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం గ్రామంలోని శ్రీ రాజుల స్వామి గుడికి కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని కోరారు. రూ.15 లక్షలు మంజూరు చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.