కొబ్బరి చెట్టు మట్టపై అద్భుతమైన పెయింటింగ్

CTR: మరో రెండు రోజుల్లో 2025 ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుండడంతో మొదటి మ్యాచ్ చెన్నై, ముంబై టీమ్‌ల మధ్య జరగనుంది. దీంతో కుప్పం కళాకారుడు పురుషోత్తం(పూరి ఆర్ట్స్) తన కళానైపుణ్యంతో చిన్ననాటి క్రికెట్‌ను గుర్తు చేస్తూ వినూత్నంగా పెయింటంగ్ వేశారు. కొబ్బరి చెట్టు మట్టతో బ్యాట్‌గా తయారు చేసి మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ చిత్రాలను అద్భుతంగా వేశారు.