యువకుడిని చితకబాదిన ఎస్సై

యువకుడిని చితకబాదిన ఎస్సై

కడప: పులివెందులలో ఆదివారం రాత్రి బాలాజీ అనే యువకుడిని ఎస్సై నారాయణ చితకబాదారు. అతడి తలకు గాయమై పరిస్థితి విషమించడంతో పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. మెరుగైన చికిత్సకు కడప రిమ్స్‌కు తరలించారని, ఆ వ్యక్తి టీడీపీ కార్యకర్త అని సమాచారం.