'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
VSP: మోంథా తుపాను నేపథ్యంలో భీమిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంగళవారం పర్యటించారు. ఆయన రుషికొండ, సీతకొండ తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా, అధికారులు, పార్టీ శ్రేణులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అత్యవసర పరిస్థితి వచ్చినా తక్షణమే స్పందించి సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు.